సెకండరీ పాఠశాలల్లో ఫస్ట్ ఎయిడ్ లెసన్స్..!!
- September 06, 2025
రియాద్: సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మాధ్యమిక స్థాయి పాఠ్యాంశాల్లో ప్రథమ చికిత్స విధానాలను పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుందన్నారు. తద్వారా అత్యవసర సమయంలో వేగంగా స్పందించడంతోపాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి ప్రాణాలను కాపాడడంలో సహాయంగా ఉంటుందన్నారు. ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ తన జాతీయ పాఠ్య ప్రణాళికలో దీనిని చేర్చినట్లు తెలిపింది.
రక్తస్రావం, కాలిన గాయాలు, థర్మల్ షాక్ మరియు మూర్ఛ వంటి వివిధ గాయాలకు ప్రథమ చికిత్స అందించడంతోపాటు గుండెపోటు సమయంలో అందించే CPR పై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







