ఇండో-కువైటీ సంబంధాలపై బుక్ రిలీజ్..!!
- September 06, 2025
కువైట్: ఇండో-కువైటీ సంబంధాలపై ప్రముఖ జర్నలిస్ట్ చైతాలి బెనర్జీ రాయ్ ఓ బుక్ రాశారు. సదాకా: పార్టనర్‌షిప్ అండ్ కల్చరల్ కిన్‌షిప్ పేరుతో రాసిన బుక్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె ప్రసిద్ధ ఆడియోవిజువల్ సిరీస్ సదాకా మొదటి రెండు సీజన్‌లను ఆధారంగా చేసుకుని ఈ పుస్తకాన్ని రాసినట్లు తెలిపారు. ఇండియా-కువైట్ మధ్య శాశ్వత సాంస్కృతిక, సామాజిక మరియు ఆర్థిక బంధాలను తన కథనాల ద్వారా వివరించినట్లు వెల్లడించారు.
రెండు దశాబ్దాలకు పైగా కువైట్‌లో పనిచేసిన ప్రముఖ సాంస్కృతిక జర్నలిస్ట్ చైతాలి బి రాయ్ రచించిన సదాకా.. ఉమెన్ ఆఫ్ కువైట్: టర్నింగ్ టైడ్స్ పేరుతో 2016లో తొలి పుస్తకం రాశారు. పుస్తకం ప్రముఖ పుస్తక కేంద్రాల్లో అందుబాటులో ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







