ఖతార్ పీఎంకు UK విదేశాంగ కార్యదర్శి ఫోన్..!!
- September 07, 2025
దోహా: ఖతార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్-థానీకి యునైటెడ్ కింగ్‌డమ్ విదేశాంగ మరియు కామన్వెల్త్ వ్యవహారాల కార్యదర్శి HE య్వెట్ కూపర్ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. రెండు దేశాల మధ్య సహకార సంబంధాలను వారు సమీక్షించారు. ఈ సందర్భంగా విదేశాంగ కార్యదర్శిగా య్వెట్ కూపర్ నియామకంపై ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. ఆమె విధులను నిర్వర్తించడంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా గాజా స్ట్రిప్ మరియు ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని పరిణామాలు, ఉమ్మడి ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు. గాజా స్ట్రిప్‌పై యుద్ధాన్ని ముగించడానికి ప్రాంతీయ మరియు అంతర్జాతీయ ప్రయత్నాలను ముమ్మరం చేయవలసిన అవసరం ఉందన్నారు. యుద్ధ బాధితులకు అడ్డంకులు లేని మానవతా సహాయాన్ని అందేలా చూడాలని కోరారు. ఖైదీలు, నిర్బంధితులను వెంటనే విడుదల చేసి, సమస్యకు శాశ్వతంగా పరిష్కారాన్ని చర్చల ద్వారా కనుగొనాలని ఇరువురు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స







