దుబాయ్ లో బస్ స్టాప్‌లోకి దూసుకొచ్చిన లారీ..!!
- September 07, 2025
దుబాయ్: దుబాయ్‌లోని అల్ నహ్దా స్ట్రీట్‌లో మెట్రో స్టేషన్ ఎదురుగా ప్రమాదం చోటుచేసుకుంది. ఒక లారీ అదుపుతప్పి బస్ స్టాప్‌లోకి దూసుకెళ్లింది. లోపల ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఒక బాధితుడికి తీవ్ర గాయాలు కాగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టు పోలీసు ఉన్నతాధికారి బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ తెలిపారు.
కాగా, ప్రమాదం కారణంగా అల్ నహ్దా వీధిలో తాత్కాలికంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలలో మళ్లించినట్టు తెలిపారు. ట్రాఫిక్ చట్టాలను అందరూ కచ్చితంగా పాటించాలని సూచించారు. ఆకస్మిక లేన్ మార్పులు తీవ్రమైన ప్రమాదాలకు కారణం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్ స్టాప్‌లు, మెట్రో స్టేషన్ల సమీపంలో జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని ఆయన వాహనదారులకు సూచించారు.
తాజా వార్తలు
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!







