ఈ ఏడాది చివరికల్లా రిఫా వాక్‌వే ప్రాజెక్టు..!!

- September 07, 2025 , by Maagulf
ఈ ఏడాది చివరికల్లా రిఫా వాక్‌వే ప్రాజెక్టు..!!

మనామా: బహ్రెయిన్ లోని దక్షిణ గవర్నరేట్‌లోని రిఫా వాక్‌వే అభివృద్ధి ప్రాజెక్టును మునిసిపాలిటీలు మరియు వ్యవసాయ వ్యవహారాల మంత్రి వేల్ బిన్ నాసర్ అల్ ముబారక్ సందర్శించారు. మున్సిపల్ వ్యవహారాల అండర్ సెక్రటరీ షేక్ మొహమ్మద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, దక్షిణ మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ అబ్దుల్లా ఇబ్రహీం అబ్దుల్ లతీఫ్ లతో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు. మొత్తం అభివృద్ధి ప్రణాళికను సమీక్షించారు.

ఈ పర్యటన సందర్భంగా ప్రాజెక్టులో దాదాపు 60% పూర్తయిందని, మిగిలిన పనులు ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తవుతుందని మంత్రి చెప్పారు. బహ్రెయిన్ లో నివాసితులకు కొత్త వినోద మరియు సేవా సౌకర్యాలను అందించే కీలకమైన ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. 

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బీచ్‌లు, పార్కులు, వాకింగ్ ట్రాక్ లు, ప్లే గ్రౌండ్స్, ఎంటర్ టైన్ మెంట్ జోనులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి ప్రాజెక్టులు జాతీయ అభివృద్ధికి దోహదం చేస్తాయని, అదే సమయంలో పౌరులు, నివాసితులకు ఆహ్లాదాన్ని అందిస్తాయని మంత్రి వేల్ బిన్ నాసర్ అల్ ముబారక్ వివరించారు. 

రిఫా వాక్‌వే ప్రాజెక్ట్ 36,018 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో షేడ్‌లు, ఆట స్థలాలు, లైటింగ్ మరియు పబ్లిక్ యూటిలిటీస్, ఆధునిక ఫిట్‌నెస్ పరికరాలు,  అందమైన ల్యాండ్ స్కేపులు అందరిని ఆకట్టుకునేలా ఏర్పాటు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com