ఒమన్‌లో సంపూర్ణ చంద్రగ్రహణం.. టైమింగ్స్..!!

- September 07, 2025 , by Maagulf
ఒమన్‌లో సంపూర్ణ చంద్రగ్రహణం.. టైమింగ్స్..!!

మస్కట్: ఒమన్ లో సెప్టెంబర్ 7న ఆకాశంలో అద్భుతమైన,  అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం చోటుచేసుకుంటుంది. మస్కట్ సమయం ప్రకారం సాయంత్రం 7:28 గంటలకు పెనుంబ్రల్ గ్రహణంతో ఇది ప్రారంభమవుతుందని ఒమన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఇషాక్ బిన్ యాహ్యా అల్ షుహైలి చెప్పారు.

రాత్రి 8:27 గంటలకు పాక్షిక దశకు, రాత్రి 9:31 గంటలకు చంద్రుడు భూమి నీడలోకి పూర్తిగా ప్రవేశిస్తాడని తెలిపారు.  ఇక సంపూర్ణ గ్రహణం రాత్రి 10:11 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, రాత్రి 10:53 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మొత్తంగా చంద్రగ్రహణం 5 గంటల 27 నిమిషాల పాటు కొనసాగుతుందని వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com