తెలుగు సినిమాలన్నీ ఒకే తరహాలో సాగుతాయని నిత్యా
- July 19, 2016
నిత్యామీనన్ ఏవిషయం పై అయినా చాలా స్పష్టంగా నిర్మొహమాటంగా తన మనసులో ఉన్నది ఉన్నట్లు చెపుతూ అందరికీ తరుచు షాక్ ఇస్తూ ఉంటుంది. ఇలా మాట్లాడటం వలన ఆమెకు ఎంత ప్రతిభ ఉన్నా టాలీవుడ్ లో అవకాశాలు రావడం లేదు అన్నది ఓపెన్ సీక్రెట్.
త్వరలో విడుదల కాబోతున్న ఆమె నటించిన సినిమా '100 డేస్ లవ్' సినిమా ప్రమోషన్ కోసం ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తెలుగు సినిమాల పై సంచలన వ్యాఖ్యలు చేసింది నిత్య 'అందం అభినయం రెండు సమపాళ్లల్లో ఉన్న మీరు సినిమాలలో చాలా తక్కువగా ఎందుకు నటిస్తున్నారు' అంటూ ఆ ఇంటర్వ్యూ ను నిర్వహిస్తున్న ప్రోగ్రాం ప్రెజంటర్ అడిగిన ప్రశ్నకు నిత్య చాలా విభిన్నంగా సమాధానం ఇచ్చింది.
తెలుగు సినిమాలన్నీ ఒకే తరహాలో సాగుతాయని హీరో అల్లరి చిల్లరగా తిరుగుతూ హీరోయిన్ వెంట పడుతుంటాడని అతన్ని హీరోయిన్ ప్రేమిస్తుందని తర్వాత హీరోయిన్ ని ఇంటికి చేర్చడమో లేక విలన్ తో పగ తీర్చుకోవడమో జరుగుతుందని అంతకు మించి తెలుగు సినిమాలలో ఏముంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది నిత్య. అంతేకాదు ఒకే తరహా సినిమాలలో నటించడం వలన ఆనందం, సంతృప్తి రెండూ ఉండవని, మూస సినిమాల్లో చేయడం తనకు ఇష్టం ఉండదని,అందుకే విభిన్న పాత్రలు వచ్చినప్పుడే తను నటిస్తున్నాను అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది.
ఈ కామెంట్స్ నిత్య నోటి వెంట విన్నవ్వారు అంతా షాక్ అయ్యారు. ఒక వైపు తెలుగు సినిమాలలో నటిస్తూ అదే ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేయడం ఎంతవరకు సమంజసం అన్నది నిత్య కే తెలియాలి..
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









