మస్కట్‌లో COMEX 2025 ప్రారంభం..!!

- September 08, 2025 , by Maagulf
మస్కట్‌లో COMEX 2025 ప్రారంభం..!!

మస్కట్: గ్లోబల్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ "COMEX 2025" 34వ ఎడిషన్ ప్రారంభమైంది. రక్షణ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్ దీనిని ప్రారంభించారు. 

ఒమన్ కన్వెన్షన్ & ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో ఏఐ, సైబర్ భద్రత, అంతరిక్ష పరిశ్రమ అభివృద్ధి, ఆధునిక డిజిటల్ టెక్నాలజీ ఆవిష్కరణలతో సహా అత్యాధునిక సాంకేతిక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇప్పటివరకు టెక్నాలజీ రంగంలో కొత్త ఉత్పత్తులు అన్నింటిని ఒకే చోట చూసే వీలు కల్పించారు. అలాగే, ఆధునిక టెక్నాలజీలో పరిశోధన, ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com