ఖతార్ లో పుణే యూనివర్సిటీ BEd ప్రోగ్రామ్..!!
- September 08, 2025
దోహా: సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్సిటీ (SPPU) ఖతార్ క్యాంపస్ లో ప్రతిష్టాత్మక బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (BEd) డిగ్రీ ప్రోగ్రామ్ను అధికారికంగా ప్రకటించింది. ఈ రెండు సంవత్సరాల ప్రోగ్రామ్ ను MIE-SPPU ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తో కలిసి ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది.
ఇండియాలోని అగ్రశ్రేణి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఒకటైన సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్సిటీ అందించే BEd డిగ్రీ కోర్సు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇండియాలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE), అలాగే ఖతార్లోని విద్య , ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ గుర్తించాయి. ఈ బీహెడ్ సిలబస్ భారత్ లోని జాతీయ విద్యా విధానం (NEP 2020)కి అనుగుణంగా ఉంటుందని తెలిపింది.
తాజా వార్తలు
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్







