30శాతం డిస్కౌంట్స్ ప్రకటించిన ఎతిహాద్ ఎయిర్వేస్..!!
- September 08, 2025
యూఏఈ: ఈ వింటర్ సీజన్ కోసం ఎతిహాద్ ఎయిర్వేస్ 30 శాతం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఆసియా మరియు ఆఫ్రికాలోని కొన్ని గమ్యస్థానాలకు తగ్గింపు ధరలు వర్తిస్తాయని తెలిపింది. ఆఫర్ సెప్టెంబర్ 12 వరకు అందుబాబులో ఉంటుంది. తగ్గింపు ధరలతో కొనుగోలు చేసిన టిక్కెట్లతో సెప్టెంబర్ నెల నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ప్రయాణించవచ్చు.
థాయిలాండ్‌లోని క్రాబీ మరియు చియాంగ్ మై, కంబోడియాలోని నమ్ పెన్, అల్జీరియాలోని అల్జీర్స్, ట్యునీషియాలోని ట్యూనిస్, వియత్నాంలోని హనోయ్ మరియు ఇండోనేషియాలోని మెడాన్ వంటి ప్రసిద్ధ నగరాలకు టిక్కెట్ల ధరలు Dh1,835 నుండి ప్రారంభమవుతాయని తెలిపింది. అలాగే, ఇథియోపియాలోని అడిస్ అబాబా మరియు రష్యాలోని కజాన్లకు విమానాలు Dh1,465 నుండి ధరలు ప్రారంభమవుతాయని, హాంకాంగ్‌కు Dh1,935 నుండి ధరలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. పాకిస్తాన్‌లోని పెషావర్‌కు Dh895, తైపీకి Dh1,985 ధరలకే వెళ్లవచ్చని వెల్లడించింది.
తాజా వార్తలు
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!
- ఫోటోగ్రఫీ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఒమన్..!!
- యూఏఈలో 17 కిలోల కొకైన్ సీజ్..!!
- బహ్రెయిన్ దక్షిణ గవర్నరేట్ కు WHO 'హెల్తీ గవర్నరేట్' హోదా..!!
- కువైట్‌లో నేడు క్లాసెస్ రద్దు..!!
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!







