కొత్త చట్టం ప్రకారం కార్మికులకు ఉచిత అకామడేషన్‌

- July 19, 2016 , by Maagulf
కొత్త చట్టం ప్రకారం కార్మికులకు ఉచిత అకామడేషన్‌

2000 దిర్హామ్‌ల కంటే తక్కువ వేతనం అందుకుంటున్న కార్మికులకు, యజమాని ఉచిత అకామడేషన్‌ కల్పించేలా కొత్త చట్టం అమల్లోకి రానుంది. అయితే 50 మందికి పైగా కార్మికుల్ని హైర్‌ చేసుకున్న సంస్థలకు ఈ నిబంధన వర్తిసు&ంది. మినిస్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ అండ్‌ ఎమిరటైజేషన్‌ సక్ర్‌ ఘోబాష్‌ ఓ పత్రికా ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్‌లో ఈ డిక్రీ విడుదల కానుంది. డిక్రీ అమల్లోకి వచ్చాక దాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు విరివిగా తనిఖీలను నిర్వహిస్తారు. కార్మికులకు తగిన సౌకర్యాల్ని ఖచ్చితంగా సంస్థలు లేదా యజమానులు కల్పించాల్సిందేనని మినిస్టర్‌ ఘోబాష్‌ తెలిపారు. లేబర్‌ మార్కెట్‌కి సంబంధించి ఇటీవలి స్టడీస్‌ని పరిశీలలోకి తీసుకుని డిక్రీని విడుదల చేయనున్నామని ఆయన చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com