ప్రమాద దృశ్యాలపై యూఏఈ మినిస్ట్రీ వార్నింగ్
- July 19, 2016
ట్రాఫిక్ యాక్సిడెంట్లకు సంబంధించి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టింగులు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని యూఏఈ మినిస్ట్రీ హెచ్చరించింది. హ్యూమన్ డిగ్నిటీ, బాధిత కుటుంబీకుల సెంటిమెంట్లను దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు చేపట్టరాదని మినిస్ట్రీ వర్గాలు హెచ్చరించాయి. మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. బాధ్యతారహిత్యం, సానుకూల దృక్పథం లేకపోవడం వంటి చర్యలకు పాల్పడరాదనీ, ఇది చట్ట వ్యతిరేకమని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇటీవల అజ్మన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి సోషల్ మీడియాలో భయం గొలిపే ఫొటోలను పోస్ట్ చేయడం పట్ల మినిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫొటోలు, వీడియోల కారణంగా బాధిత కుటుంబాలు షాక్‌కి గురయ్యే అవకాశం ఉందనీ, అలాగే వారి మనో వేదనను ఇంకా పెంచుతాయి కాబట్టి, ఇటువంటి చర్యలు ఎవరూ చేపట్టరాదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







