టీటీడీ ఈవోగా మళ్లీ అనిల్‌కుమార్ సింఘాల్
- September 09, 2025
ఆంధ్రప్రదేశ్ లో 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కీలకమైన శాఖలు అప్పగించింది. కేంద్ర సర్వీసుల నుంచి తిరిగొచ్చి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అనిల్‌కుమార్ సింఘాల్ మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో)గా నియమితులయ్యారు. ఆ స్థానంలో ఉన్న జె.శ్యామలరావు ను సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ-పొలిటికల్) ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీచేసింది. ప్రస్తుతం అక్కడున్న ముకేశ్‌కుమార్ మీనాను రెవెన్యూ (ఎక్సైజ్) ముఖ్య కార్యదర్శిగా నియమించింది. అటవీ-పర్యావరణ శాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్న జి.అనంతరామును బదిలీచేసి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సింఘాల్ గతంలోనూ టీటీడీ ఈవోగా పనిచేశారు. చంద్రబాబు హయాంలో 2017 మే 6న ఈ బాధ్యతలు చేపట్టిన ఆయన, వైసీపీ ప్రభుత్వంలో 2020 అక్టోబరు 4 వరకు పనిచేశారు. ఐదేళ్ల తర్వాత రెండోసారి ఈ పదవిలో నియమితులు కావడం గమనార్హం.
తాజా వార్తలు
- టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష
- ఢిల్లీ చేరుకున్న సీఏం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!
- ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!