మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!

- September 11, 2025 , by Maagulf
మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!

దుబాయ్: పెట్టుబడిదారుల రాకతో దుబాయ్‌.. లండన్, పారిస్ మరియు మిలన్ తర్వాత మధ్యప్రాచ్యంలో నాల్గవ-సంపన్న నగరంగా నిలిచింది. యూరప్, మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా (EMEA)లో నాల్గవ స్థానంలో నిలిచింది. ది రైజ్ ఆఫ్ దుబాయ్ అధ్యయనం ప్రకారం.. జూన్ 2025 చివరి నాటికి దుబాయ్ 86 వేల మంది మిలియనీర్లు, 251 మంది సెంటీ-మిలియనీర్లు,  23 మంది బిలియనీర్లకు నిలయంగా ఉంది.

ప్రస్తుత వృద్ధి రేటు ఇలాగే కొనసాగితే, 2040 నాటికి దుబాయ్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరంగా అవతరిస్తుందని న్యూ వరల్డ్ వెల్త్ పరిశోధనా అధిపతి ఆండ్రూ అమోయిల్స్ అన్నారు.

ఇక మొదటి స్థానంలో ఉన్న లండన్ 2 లక్షల 12వేల మంది మిలియనీర్లకు నిలయంగా ఉండగా, పారిస్ 1 లక్ష 63వేల మందితో రెండవ స్థానంలో.. మిలన్ 1 లక్ష 21వేల మందితో మూడవ స్థానంలో ఉంది.

దుబాయ్ సాంప్రదాయ మార్కెట్లతోపాటు కొత్త పెట్టుబడి అవకాశాలను అందిస్తుందని స్టీవార్డ్స్ ఇన్వెస్ట్‌మెంట్ క్యాపిటల్ CEO బిలాల్ ఆడమ్ అన్నారు.  తక్కువ పన్నులు, అత్యంత వైవిధ్యభరితమైన ఆర్థిక వ్యవస్థ,  పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు, బలమైన ఎయిర్ కనెక్టివిటీ, బలమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫస్ట్-క్లాస్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, మంచి అంతర్జాతీయ స్కూల్స్, ఏడాది పొడవునా టూరిజం కార్యకలాపాల కారణంగా దుబాయ్ పెట్టుబడిదారులకు ఆకర్షణీయ నగరంగా ప్రత్యేకతను నిలుపుకుంటుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com