రేపల్లె రైల్వే లైను త్వరలో సాకారం: మచిలీపట్నం ఎంపి బాలశౌరి
- September 09, 2025
మచిలీపట్నం: ఈరోజు ఢిల్లీలో లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషన్ చైర్మన్ మరియు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అధ్యక్షతన రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తో మరియు ఇతర రైల్వే ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో రైల్వే మంత్రిత్వ శాఖ విధి విధానాల గురించి చర్చించిన లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషన్ చైర్మన్ బాలశౌరి, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని పలురైల్వే అంశాలను రైల్వే బోర్డ్ చైర్మన్ దృష్టికి తేవడం జరిగింది.
కృష్ణా జిల్లా ప్రజలచిరకాల వాంఛ అయిన మచిలీపట్నం రేపల్లె రైల్వే నూతన లైను గురించి రైల్వే బోర్డు చైర్మన్ తో చర్చించడం జరిగింది. ఈ నూతన రైలు మార్గం కోసం గతంలో అనేక ఉద్యమాలు, ఆందోళనలు జరిగాయని, ఈ మార్గం వలన కోల్ కతా నుండి చెన్నై వెళ్ళే రైళ్ళువిజయవాడ జంక్షన్ మీదుగా వెళ్ళకుండా, మచిలీపట్నం మీదుగా వెళ్ళడానికి అవకాశం కలుగుతుందని, ఈ మార్గం గుండా రైళ్ళు ప్రయాణిస్తే 70 కిలో మీటర్ల మేరకు దుర్గం తగ్గడంతో బాటు, విజయవాడ జంక్షన్ పైన రైళ్ళ ట్రాఫిక్ భారం కూడా కొంతమేరకు తగ్గుతుందని, ప్రయాణ సమయం కలిసి రావడంతో బాటు సరుకు రవాణా ఖర్చులు కుడా గణనీయంగా తగ్గుతాయని తెలపడం జరిగింది, త్వరలో పూర్తీ కానున్న మచిలీపట్నం పోర్టు నుండి కుడా సరుకుల రవాణాను తక్కవ ఖర్చుతో చేయవచ్చని చైర్మన్ కు ఎంపి వివరించారు.తీరప్రాంతంలో అత్యంత ముఖ్యమైన కోస్టల్ లైనుగా ఇది భవిష్యత్తులో ఉపయోగపడుతుందని, ప్రధానంగా మచిలీపట్నం పోర్టుకు సరుకు రవాణాలో కీలక మార్గం కాబోతుందని వివరించడం జరిగింది. ప్రతిపాదిత కోస్టల్ రైల్వే కారిడార్ లో ( నరసాపూర్ – మచిలీపట్నం – రేపల్లె – నిజాంపట్నం – బాపట్లలను కలుపుతూ ) ఇది ముఖ్యమైన పాత్ర వహిస్తుందని, అందువలన సదరు మచిలీపట్నం రేపల్లె రైలు మార్గం యొక్క డి.పి.ఆర్ తయారిని వెంటనే పూర్తిచేసి పనులకు అవసరమైన అనుమతులు మంజూరు చేయవలసినదిగా ఎంపి కోరారు.
వివిధ ఆర్ వో బిలు మరియు ఆర్ యు బిల నిర్మాణం:
కృష్ణా జిల్లా ప్రజల నుండి వస్తున్న అనేక విజ్ఞప్తుల మేరకు, మరియు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి గాను, రామవరప్పాడు, గూడవల్లి, తెన్నేరు, పెడన, మచిలీపట్నం లో పెడన, మెడికల్ కళాశాల, బందరు పోర్ట్ మరియు గుడివాడ గేట్ల వద్ద నూతనంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి మరియు రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం కొరకు ప్రతిపాదనలణు రైల్వే బోర్డు చైర్మన్ కు ఎంపి బాలశౌరి అందచేశారు. ఇవన్నికూడా కృష్ణా జిల్లాలో ట్రాఫిక్ సమస్యలకు తగ్గించడానికి సరైన పరిష్కారంగా నిలుస్తాయని వివరించారు.
బందరు నుండి తిరుపతికి ప్రతి రోజు రైలు:
కృష్ణా జిల్లా ప్రజలు ఎప్పటినుండో మచిలీపట్నం నుండి తిరుపతికి ప్రతిరోజు రైలు ఏర్పాటు చేయాలనీ కోరుతున్నారు. దీనిగురించి చైర్మన్ తో మాట్లాడుతూ గతంలో నర్సాపురం నుండి కొన్ని బోగీలు, మచిలీపట్నం నుండి కొన్ని బోగీలు గుడివాడలో కలిపి తిరుపతికి వెళ్ళేవారని, అందువలన తిరుపతి వెళ్ళే ప్రయాణికులకు ముఖ్యంగా వృద్ధులకు, మహిళలకు అసౌకర్యంగా ఉంటుంది అని, లగేజిని తీసుకు వెళ్ళడం, ప్లాట్ ఫారం లు మారడం ఇబ్బందికరంగా ఉందని వచ్చిన ఆరోపణల నేపధ్యంలో మచిలీపట్నం నుండి తిరుపతికి ప్రతిరోజూ తిరిగేలాగున ఒక రైలు ఏర్పాటు చేయాలని చైర్మన్ ను కోరడంజరిగింది. కృష్ణా జిల్లా కేంద్రం అయిన మచిలీపట్నం నుండి ప్రతిరోజూ పెద్ద ఎత్తున తిరుపతికి వెళ్లి, వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలనే భక్తులకు ఈ రైలు సౌకర్యంగా ఉంటుందని తెలపడం జరిగింది.
పై విషయాలను పరిశీలించి సానుకూలంగా త్వరలోనే తగినచర్యలు చేపట్టడం జరుగుతుందని రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషన్ చైర్మన్ మరియు ఎంపి బాలశౌరికి తెలియచేశారు.ఈ సమావేశంలో చైర్మన్ సతీష్ కుమార్, రైల్వే బోర్డు మెంబర్లు నవీన్ గులాటి,హితేంద్ర మల్హోత్రా, బ్రజ్ మోహన్ అగర్వాల్, డైరెక్టర్ జనరల్ హ్యూమన్ రిసోర్సు రాజగోపాల్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డిజి మిస్ సోనాలి మిశ్రా, అడిషనల్ మెంబర్ రాజేష్ కుమార్ కశ్యప్, రైల్వే బోర్డు సెక్రటరీ అరుణ్ నాయర్, IRFCL CMD మనోజ్ కుమర్ దూబే, రైల్వే టూరిజం అండ్ కేటరింగ్ కార్పోరేషన్ CMD సంజయ్ కుమార్ జైన్, CCI CMD సంజయ్ స్వరూప్, ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ కంపెనీ CMD హరి మోహన్ గుప్తా మరియు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ డైరెక్టర్ అనురాగ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష
- ఢిల్లీ చేరుకున్న సీఏం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్..
- భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!
- ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!