నవంబర్ 5 నుండి 8 వరకు ఖతార్ బోట్ షో..!!
- September 09, 2025
దోహా: ఖతార్ బోట్ షో 2025 ఎడిషన్ తేదీలను నిర్వాహకులు ప్రకటించారు. నవంబర్ 5 నుండి 8 వరకు ఓల్డ్ దోహా పోర్టులో జరగనుంది.ఈ మేరకు నిర్వాహక కమిటీ ఛైర్మన్ , ఓల్డ్ దోహా పోర్ట్ CEO ఇంజనీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ముల్లా తెలిపారు.
గతేడాది నిర్వహించిన ప్రారంభ ఎడిషన్ లో 495 ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లు పాల్గొన్నాయి. 100 కి పైగా లగ్జరీ బోట్స్ ను ప్రదర్శించారు. దీనికి 90 దేశాల నుండి 25వేలకు పైగా సందర్శకులు హజరయ్యారు.
ఖతార్ బోట్ షో 2025 లో పాల్గొనేందుకు ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన యాచ్ బిల్డర్లు వస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రీమియర్ శ్రేణి లగ్జరీ బోట్స్ ను ప్రదర్శనలో చూడవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







