దోహాలో భారీ పేలుళ్లు–దాడిని ఇజ్రాయెల్ ధృవీకరణ
- September 09, 2025
దోహా: ఇజ్రాయెల్ సైన్యం ఖతార్‌లో హమాస్ నేతలపై దాడి జరిపినట్టు ఇజ్రాయెల్ అధికారికంగా ధృవీకరించింది.ఈ విషయం పై ఐడీఎఫ్ (Israel Defense Forces) ఎక్స్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది.
ఐడీఎఫ్ తెలిపిన ప్రకారం – “హమాస్ తీవ్రవాద సంస్థ సీనియర్ నేతల పై ఐడీఎఫ్ మరియు ఐఎస్ఏ (ISA) సంయుక్తంగా ఖచ్చితమైన దాడి జరిపాయి. ఈ హమాస్ నాయకులు ఎన్నో సంవత్సరాలుగా సంస్థ కార్యకలాపాలను నడిపిస్తూ, అక్టోబర్ 7 న జరిగిన క్రూరమైన మారణహోమానికి నేరుగా బాధ్యులుగా ఉన్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్‌పై జరుగుతున్న యుద్ధాన్ని కూడా వీరే ప్రణాళికలు రచించి నడిపిస్తున్నారు” అని పేర్కొంది.
పౌరులకు హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, అందులో భాగంగా అత్యంత ఖచ్చితమైన ఆయుధాలు, అదనపు గూఢచారి సమాచారం ఉపయోగించామని ఐడీఎఫ్ వెల్లడించింది.
“అక్టోబర్ 7 మారణహోమానికి బాధ్యులైన హమాస్ తీవ్రవాద సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు మా చర్యలు కఠినంగా కొనసాగుతాయి” అని ఐడీఎఫ్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష
- ఢిల్లీ చేరుకున్న సీఏం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!
- ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!