రియో ఒలింపిక్స్ క్రీడాకారులను ఉత్తేజపరిచేందుకు రెహమాన్ స్ఫూర్తి సందేశం
- July 19, 2016
రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన క్రీడాకారులను ఉత్తేజపరిచేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్ఫూర్తి సందేశం ఇచ్చారు. రియో కోసం భారత ఒలింపిక్ అసోసియేషన్ నియమించిన గుడ్‌విల్ అంబాసిడర్లలో ఒకరైన రెహమాన్ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. రియో వెళ్లనున్న భారత ఒలింపిక్ బృందానికి సోమవారం దిల్లీలో వీడ్కోలు పలికిన అనంతరం రెహమాన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
మనసు, పూర్తి శక్తి పెడితే ఈ ప్రపంచంలో సాధించలేనిదేదీ లేదని రెహమాన్ పేర్కొన్నారు. మనల్ని ఆపేవారెవరూ లేరని అన్నారు. నిరాశ పడకుండా ముందుకెళ్లడం చాలా ముఖ్యమైన అంశమని, చేసే పని మధ్యలో వదిలేయొద్దని రెహమాన్ పోస్ట్‌లో తెలిపారు.
ఒకప్పుడు తాను కూడా భారతీయ వ్యక్తికి ఆస్కార్ అవార్డు లేదా గ్రామీ అవార్డు రావడమనేది అసాధ్యమని అనుకునే వాడినని.. కానీ అది సాధ్యమేనని కాలం నిరూపించిందని రెహమాన్ అన్నారు. భారత్ ఈ సారి ఒలింపిక్స్‌కు 121 మంది అథ్లెట్లను పంపించింది. వారిలో 54 మంది మహిళలు ఉన్నారు. రెహమాన్‌తో పాటు బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, షూటర్ అభినవ్ బింద్రా ఒలింపిక్స్ గుడ్‌విల్ అంబాసిడర్లుగా ఉన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







