'తెలంగాణ ఎన్నారై పాలసీ' రూపకల్పన పై జులై 27న ప్రభుత్వ సమావేశం

- July 19, 2016 , by Maagulf
'తెలంగాణ ఎన్నారై పాలసీ' రూపకల్పన పై జులై 27న ప్రభుత్వ సమావేశం

తెలంగాణ ఎన్నారై పాలసీ (ప్రవాసి విధానం) రూపకల్పన గురించి తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నది. ఈ మేరకు ఎన్నారై సంఘాలు, ఎన్నారైలతో జులై 27 న మద్యాహ్నం 2గంటలకు హైదరాబాద్, బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ప్రక్కనగల బాలయోగి పర్యాటక్ భవన్ లోని హరిత ప్లాజలో సమావేశం నిర్వహిచనున్నట్లు ఎన్నారై శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు.
జులై 16 జరపాలనుకున్న సమావేశానికి తక్కువ సమయం ఉండడంతో, పలు ఎన్నారై సంఘాలు కొంత గడువు కోరడంతో 27న నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి వచ్చే సంఘాల ప్రతినిధులు ఎన్నారై పాలసీ కోసం సూచించాల్సిన సలహాలు, సమాచారాన్ని లిఖిత పూర్వంగా ఇచ్చేందుకు ప్రయత్నం చేయాలని మంత్రి కోరారు.
సమావేశానికి హజరు కాలేని వారు [email protected] ఈ మెయిల్ చేయాలని కోరారు. మరింత సమాచారం కోసం +91 40 2345 0455 పోన్ నంబర్ కు సంప్రదించవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com