సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!
- September 11, 2025
కువైట్: కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాతో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ షేక్ హోముద్ ముబారక్ అల్-హోముద్ అల్-జాబర్ అల్-సబా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పౌర విమానయాన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.
వీటితోపాటు, ఆసక్తి ఉన్న రంగాలపై చర్చలు జరిపినట్లు ఒక ప్రకటనలో షేక్ హోముద్ అల్-సబా తెలిపారు. ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం టెక్నాలజీ సంబంధిత రంగాల్లో సహకారాన్ని విస్తరించే అవకాశాలపై సమీక్షించినట్లు పేర్కొన్నారు. పౌర విమానయానంలో కువైట్‌తో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని డాక్టర్ ఆదర్శ్ స్వైకా తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!
- సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!
- ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!
- సౌదీ అరేబియాలో 3.6 మిలియన్ల ప్రొడక్టులు సీజ్..!!
- టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను పరిశీలించిన టిటిడి ఈవో