తైవాన్ లో బస్సు దగ్ధం, 26 మంది పర్యాటకులు సజీవ దహనం
- July 19, 2016
బస్సులో బయలుదేరిన వారంతా కొద్ది సేపట్లో విమానాశ్రయానికి చేరుకునేవారు.. ఒకటి రెండు గంటల్లో ఎవరింటికి వారు వెళ్లిపోయేవారు. కానీ వారిని అగ్ని.. గండంలా చుట్టుముట్టింది. డ్రైవర్ సహా 26 మంది ప్రయాణికులను దహించివేసింది. ఫసిపిక్ ద్వీప దేశం తైవాన్ లో మంగళవారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. హైవే మీదుగా తాయుయాన్ విమానాశ్రయానికి వెళుతోన్న టూరిస్ట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కనీసం డోర్లు తెరిచేంత అవకాశం లేకుండా అగ్ని కీలలు బస్సును చుట్టుముట్టాయి.ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అరగంట తర్వాతగానీ మంటలను పూర్తిగా అదుపుచేయలేకపోయారు. పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రవేశద్వారం వద్ద మృతదేహాలు కుప్పలుగా పడిఉండటాన్ని బట్టి.. వారంతా బయటికి వచ్చే ప్రయత్నం చేసుంటారనే నిర్ధారణకు వచ్చినట్లు పోలీస్ క్లూస్ టీమ్ సభ్యులు చెప్పారు. చనిపోయిన వారిలో 16 మంది మహిళలు, 10 మంది పురుషులు ఉన్నారని, వీరంతా చైనాకు చెందినవారేనని పోలీసులు తెలిపారు. మంటలు చెలరేగటానికి ముందు బస్సు రోడ్డుకు ఒక పక్కగా వెళ్లిందని, అలా ఎందుకు వెళ్లిందీ, మంటలు ఎలా చెలరేగిందీ ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









