కడుపులో రాళ్లు పడితే రాళ్లను తొలగించడమే పరిష్కారం..
- July 19, 2016
-పిత్తాశయంలో కదలికలు మందగిస్తాయి-కడుపులో రాళ్లను తొలగించడమే పరిష్కారం-రాళ్లు ఎక్కువగా ఉంటే జీర్ణం కాదు -పిత్తాశయ గోడల్లో వాపు వస్తుంది ఇటీవల కాలంలో కడుపులో రాళ్లు పడటం అన్నది కామన్‌గా మారింది. ఈ మధ్య చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్యను గుర్తించటం జరుగుతోంది. తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడుతున్న వారిలో ఈ సమస్య కనిపిస్తోంది. జీర్ణ వ్యవస్థలోని పిత్తాశయం (గాల్ బ్లాడర్), క్లోమం ( పాన్ క్రియాజ్) వంటి భాగాల్లో ఈ రాళ్లు ఏర్పడుతుంటాయి. ఈ రాళ్లతో వచ్చిన అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ఈ రాళ్లను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. రాళ్లను తొలగించటం అన్నది అంతిమ పరిష్కారం అని గుర్తుంచుకోవాలి. పైత్యరసంలోని కొలిసిస్టిన్ ఎక్కువగా ఏర్పడి నప్పుడు ఇబ్బంది ఏర్పడుతుం ది. దీంతో పాటు పిత్తాశయంలో వాపు ఏర్పడే అవకాశం ఉంటుం ది. దీన్ని కొలిసిస్టిటిస్ అని వ్యవహరిస్తారు. నొప్పి తీవ్రత ద్వారా దీన్ని గుర్తించవచ్చు. కుడి వైపు పై భాగంలో ఇది మొదలవుతుంది. తర్వాత కుడిపైపు స్కా ప్యులా ఎముక ఉండే చోటికి వ్యాపించవచు. చాలాసార్లు వేపుళ్లు, నూనె దినుసులు, జంక్ ఫుడ్ తిన్న తర్వాత తలెత్తుతుంటుంది. కొద్ది పా టి జ్వరం, డయేరియా, వాంతులు, నాసియా వంటి లక్షణాల్ని కూడా గమనించవచ్చు. కొన్ని సార్లు పిత్తాశయం గోడల్లో వాపు గమనించవ చ్చు. తీవ్రమైన కేసుల్లో నెక్రోసిస్, గోడల్లో ధ్వంసం జరగటాన్ని చూడవచ్చు. గోడలు వాపు ఏర్పడిన పరిస్థితిని సాధారణ కొలిసిస్టిటిస్‌గా వ్యవహరిస్తారు. తర్వాత కాలంలో పిత్తాశయం లో కదలికలు బాగా మందగిస్తాయి. వ్యాధి ముదిరిన దశను తీవ్రతర కొలిసిస్టిటిస్‌గా చెబుతారు. ఇక క్లోమం విషయానికి వస్తే .. క్లోమంలో స్రవించే ఎంజైమ్‌లు పేగుల్లోకి వచ్చి అక్కడ ఆహారాన్ని జీర్ణం చేయాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఈ ఎంజైమ్‌లు క్లోమంలోనే ఉండి పోయి అక్కడ పనిచేయటం మొదలు పెడతాయి. ముఖ్యంగా ట్రిప్సిన్ ఇటువంటి పనులకు పాల్పడుతుంది. దీంతో క్లోమం లోపలి గోడలు పాడై పోతాయి. క్రమంగా మొత్తం క్లోమం దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్నే పాన్‌క్రియాటిస్‌గా వ్యవహరిస్తారు. ఇక, రాళ్ల సమస్య పెద్దదిగా అయినప్పుడు ఇతర జీర్ణ భాగాలకు ఇబ్బది తలెత్తవచ్చు. కొన్ని సార్లు క్లోమంలో కాల్సియం డిపాజిట్లు ఎక్కువగా పేరుకొని పోతే రాళ్లుగా మారతాయి. ఇవి జీర్ణ రసాల్ని అంటే ఎంజైమ్‌ల స్రావాన్ని అడ్డుకొనుట ద్వారా సమస్యల్ని తెచ్చి పెడతాయి. తీవ్రమైన నొప్పితో పేషంట్లు బాధ పడతారు. పిత్తాశయంలో రాళ్లను గుర్తించాక అది ప్రాథమిక దశలో ఉందా, లేక వ్యాధి తీవ్రం అవుతోందా అన్నది తేల్చుకొంటారు. చాలా ప్రాథమిక దశ అయినప్పుడు మందులతో వాటిని కరిగించేందుకు యత్నిస్తారు. లేని పక్షంలో కొలిసిస్టెక్టమీ అనే ఆపరేషను అవసరం అవుతుంది. పూర్వం కడుపుని కోసి ఈ ఆపరేషను చేయాల్సి వచ్చేది. ఇప్పుడు లాపరోస్కోపీ విధానంలో ఇది చాలా సురక్షితంగా, తేలికగా మారింది. చాలా సార్లు పిత్తాశయాన్ని తొలగించటమే అంతిమ పరిష్కారం అవుతుంది. క్లోమంలో రాళ్లను కరిగించటానికి లిథో ట్రి ప్సీ టెక్నిక్‌లను ఉపయోగిస్తారు. ఆధునిక టెక్నాలజీ సాయంతో దీన్ని సురక్షితంగా తేలిగ్గా పూర్తి చేయవచ్చని గుర్తుంచుకోవాలి. ఇది ఆధునిక టెక్నాలజీ తో కూడిన ఆపరేషన కాబట్టి నిపుణులైన సర్జన్‌లతో చేయించుకోవటం మేలు.మానవ శరీరంలో అతి చిన్న భాగాల్లో ఒకటిగా పిత్తాశయంను చెప్పుకోవచ్చు. కడుపులో కుడి వైపున పై భాగంలో ఇది అమరి ఉంటుంది. కాలేయానికి కింది భాగంలో ఉండే సంచీ వంటి భాగం ఇది. ఒక రకంగా చెప్పాలంటే కాలేయానికి అనుసంధానంగా వ్యవహరించే భాగం అనుకోవచ్చు. కాలేయం నుంచి స్రవించే పైత్య రసం తాత్కాలికంగా నిల్వ ఉండే సంచీ వంటి భాగమే పిత్తాశయం. పైత్య రసంలో వాస్తవానికి ఎటువంటి ఎంజైములు ఉండవు. కానీ, జీర్ణక్రియకు సహక రించే కొలెస్టిరాల్, బైలి రుబిన్ అనే పదార్థాలు ఇందులో ఉంటాయి. పైత్య రసం పిత్తాశయంలో ఎక్కువగా నిల్వ ఉన్నప్పుడు కొలిస్టిరాల్‌కానీ, బైలిరుబిన్ కానీ ఎక్కువగా పేరుకొని పోతుంది. అటువంటప్పుడు ఈ పదార్ధాలు ఘన రూపంలోకి మారి రాళ్లుగా పరిణామం చెందుతాయి. కొలిస్టిరాల్ కానీ రాళ్లుగా మారితే కొలిస్టిరాల్ రాళ్లు అనీ, బైలిరుబిన్ ఘన పదార్థంగా మారితే పిగ్మెంట్‌రాళ్లు అని వ్యవహరిస్తారు. పైత రసం లో ఇతర పదార్థాల శాతం పెరిగిపోయినా ఇది తలెత్తవచ్చు. కాలేయ వ్యాధులు, రక్త ప్రస రణ వ్యాధులు తలెత్తినప్పుడు కూడా రాళ్లు వస్తుంటాయి. రాళ్లతో నేరుగా వచ్చే ప్రమాదం కంటే ఇతర సమస్యలతో ఇబ్బందులు ఉంటాయి.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









