ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..

- September 11, 2025 , by Maagulf
ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..

న్యూ ఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు నడపాలని నిర్ణయించింది.

చర్లపల్లి–అనకాపల్లి మధ్య సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ప్రతి శని, ఆదివారాల్లో ఎనిమిది ప్రత్యేక రైలు సర్వీసులు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అయితే, ఈ రైళ్లు ఏ సమయానికి బయలుదేరుతాయనే వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.

ప్రత్యేక రైళ్లు.. ఆగే స్టేషన్లు..

  • చర్లపల్లి–అనకాపల్లి రైలు (07035) సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ప్రతి శనివారం నడుస్తుంది.
  • అనకాపల్లి–చర్లపల్లి రైలు (07036) సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది.
  • ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతోపాటు స్లీపర్, జనరల్ సెకెండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయి.
  • ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి స్టేషన్లలో ఆగుతాయి.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com