సేమ్యా కట్లెట్స్
- July 19, 2016
కావాల్సిన పదార్థాలు : సేమ్యా :2 కప్పులు , ఆలు గడ్డ : 2 , క్యారెట్ : 1 , ఉల్లిగడ్డ : 1 , పచ్చిమిరపకాయలు : 2 , గరం మసాల పొడి : 1 టీ స్పూన్ , బియ్యం పిండి : అర కప్పు , కొత్తిమీర : 1 కట్ట , అల్లం : చిన్న ముక్క , ఉప్పు : తగినంత , నూనె : తగినంత
తయారు చేసే విధానం :
ముందుగా సేమ్యాను ఉడికించుకోవాలి. అలాగే ఆలుగడ్డలు, క్యారెట్‌ను కూడా ఉడికించుకోవాలి. వీటిని సన్నగా తరుక్కోవాలి. దీనితో పాటు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి. ఉడికించిన సేమ్యాలో సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, ఆలుగడ్డ, క్యారెట్, పచ్చిమిరప కాయలు, కొత్తిమీరలను వేసి బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత మీకు నచ్చి ఆకారంలో కట్లెట్లుగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేయాలి. నూనె కాగిన తరువాత కట్లెట్ను వేసి తీయాలి. దోరగా వేయించిన తరువాత తీసివేస్తే సరి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







