సేమ్యా కట్లెట్స్‌

- July 19, 2016 , by Maagulf
సేమ్యా కట్లెట్స్‌

కావాల్సిన పదార్థాలు : సేమ్యా :2 కప్పులు , ఆలు గడ్డ : 2 , క్యారెట్‌ : 1 , ఉల్లిగడ్డ : 1 , పచ్చిమిరపకాయలు : 2 , గరం మసాల పొడి : 1 టీ స్పూన్‌ , బియ్యం పిండి : అర కప్పు , కొత్తిమీర : 1 కట్ట , అల్లం : చిన్న ముక్క , ఉప్పు : తగినంత , నూనె : తగినంత
తయారు చేసే విధానం :
ముందుగా సేమ్యాను ఉడికించుకోవాలి. అలాగే ఆలుగడ్డలు, క్యారెట్‌ను కూడా ఉడికించుకోవాలి. వీటిని సన్నగా తరుక్కోవాలి. దీనితో పాటు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి. ఉడికించిన సేమ్యాలో సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, ఆలుగడ్డ, క్యారెట్‌, పచ్చిమిరప కాయలు, కొత్తిమీరలను వేసి బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత మీకు నచ్చి ఆకారంలో కట్లెట్‌లుగా చేసుకోవాలి. స్టవ్‌ వెలిగించి బాణలి పెట్టి నూనె వేయాలి. నూనె కాగిన తరువాత కట్లెట్‌ను వేసి తీయాలి. దోరగా వేయించిన తరువాత తీసివేస్తే సరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com