నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్
- September 12, 2025
హైదరాబాద్: రాష్ట్రంతో ఈశాన్య రాష్ట్రాలమధ్య శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక పరమైన బంధాన్ని మరింతగా పటిష్ఠపర్చేందుకుగాను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవవర్మ ఆలోచనల మేరకు తెలంగాణ నార్త్ స్ట్ కనెక్ట్, టెక్నో, కల్చరల్ ఫెస్టివల్ అనే పేరుతో రెండు విడతలుగా మూడు రోజులు చొప్పున హైదరాబాద్ లో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ తెలంగాణ – నార్త్స్ట్ కనెక్ట్, టెక్నో, కల్చరల్ ఫెస్టివల్ కార్యక్రమాల నిర్వ హణపై గవర్నర్ కార్యాలయ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ గురవారం సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.
వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగు, సెర్ప్ సి.ఈ.ఓ దివ్య, కె. లక్ష్మీ, డైరెక్టర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, ఛీఫ్ ఫెస్టివల్ కోఆర్డినేటర్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ సి.హెచ్. ప్రియాంక, పంచాయితీ రాజ్ శాఖ డైరెక్టర్ శ్రీజన, స్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి సోని బాలదేవి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ, తెలంగాణా, ఈశాన్య రాష్ట్రాల మధ్య శాస్త్ర, సాంకేతిక, వైద్య, మహిళా సాధికారిత, సాంస్కతిక, క్రీడలు తదితర కార్యక్రమాలలో భాగంగా రెండు విడతలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
నవంబర్ 20, 21, 22 తేదీలలో మొదటి విడత, నవంబర్ 25, 26, 27 తేదీలలో రెండవ విడత కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు వివరించారు. దీనిలో భాగంగా, తెలంగాణా, ఈశాన్య రాష్ట్రాలలకు సంబందించిన సాంస్కృతిక, సాహిత్య, మ్యూజికల్ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా, ఇరు వైపులకు సంబందించిన ప్రముఖ సినిమాల ప్రదర్శన, మాహిళా సాధికారత, అభివృద్ధి తదితర అంశాలపై చర్చా వేదికలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్టు అన్నారు. హైదరాబాద్‌లో మొట్టమొదటి సారిగా నిర్వహించే ఈ కార్యక్రమాలను విజయ వంతం చేయడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
తాజా వార్తలు
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- వరసిద్ధునికి వైభవంగా అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకం కాణిపాకం
- హాంకాంగ్ పై బంగ్లాదేశ్ విజయం
- ఖతార్‌లోని కీలక ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- సుల్తాన్ తో యూఏఈ ప్రెసిడెంట్ సమావేశం..!!
- కువైట్ లో భారత రాయబారి ఆదర్శ్ స్వైకా బదిలీ..!!
- ఖతార్‌పై ఇజ్రాయెల్ ప్రకటనలను ఖండించిన యూఏఈ..!!
- UNHRCలో ఇజ్రాయెల్ పై సౌదీ అరేబియా ఫైర్..!!