ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండించిన GCC, రష్యా..!!
- September 12, 2025
సోచి: ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని రష్యాలోని సోచి నగరంలో జరిగిన గల్ఫ్ సహకార మండలి (GCC) మరియు రష్యన్ ఫెడరేషన్ 8వ మంత్రివర్గ సమావేశం తీవ్రంగా ఖండించింది. ఈ దాడి అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఖతార్ సార్వభౌమాధికారంపై దాడి.. మిడిలీస్ట్ ప్రాంతంలో భద్రత, స్థిరత్వాన్ని సాధించడానికి ఉద్దేశించిన దౌత్య ప్రయత్నాలను ఉద్దేశపూర్వకంగా అణగదొక్కడం అని సమావేశం సంయుక్త ప్రకటనలో స్పష్టం చేసింది.
ఇజ్రాయెల్ను నిరోధించడానికి, అంతర్జాతీయ శాంతి మరియు భద్రతా సూత్రాలను పదే పదే ఉల్లంఘించడాన్ని అడ్డుకోవడానికి అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సమాజం, UN భద్రతా మండలి తమ బాధ్యతలను పటిష్టంగా అమలు చేయాలని వక్తలు కోరారు.
తాజా వార్తలు
- గోల్డ్ రూల్స్..క్లారిటీ కోరిన యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ..!!
- ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని తప్పుబట్టిన UNSC..!!
- ముబారకియా మార్కెట్లో 20 దుకాణాలు మూసివేత..!!
- ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండించిన GCC, రష్యా..!!
- అరేబియా చిరుతపులి రక్షణకు మొబైల్ క్లినిక్..!!
- రీజినల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
- YSR వారసుడిగా నా కొడుకే ..వైఎస్ షర్మిల
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్