అరేబియా చిరుతపులి రక్షణకు మొబైల్ క్లినిక్..!!

- September 12, 2025 , by Maagulf
అరేబియా చిరుతపులి రక్షణకు మొబైల్ క్లినిక్..!!

మస్కట్: ధోఫర్ గవర్నరేట్‌లో అరేబియా చిరుతపులి రక్షణ కోసం మొదటి ప్రాంతీయ ప్రాజెక్ట్ మస్కట్‌లో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా తాజా వైద్య పరికరాలతో కూడిన మొబైల్ వెటర్నరీ క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. ఇది అరేబియా చిరుతపులి రక్షణలో వేగంగా స్పందించగల ఇంటిగ్రేటెడ్ యూనిట్‌గా పనిచేస్తుందని అధికారులు తెలిపారు.

ప్రత్యేక వెటర్నిటీ మెడికల్ టీం సహాయంతో ఈ యూనిట్ వన్యప్రాణుల రక్షణకు పాటుపడుతుంది. వాటి రక్షణకు తీసుకోవల్సిన విషయాలపై స్థానిక కేడర్‌లకు శిక్షణ ఇవ్వడానికి శిక్షణా కార్యక్రమాలను అమలు చేయనుంది.

ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అథారిటీ సహకారంతో పనిచేసే అరేబియా చిరుతపులి ఫండ్ మద్దతు ఇస్తుంది. ధోఫర్ గవర్నరేట్‌లోని కఠినమైన పర్వత భూభాగంలో వాటి సహజ ఆవాసాల మధ్య అరేబియా చిరుతపులికి అత్యవసర పశువైద్య సంరక్షణ అందించడానికి ఇది ప్రయత్నిస్తుందని, అరేబియా ద్వీపకల్పంలో అంతరించిపోతున్న ఈ జాతికి మిగిలి ఉన్న చివరి ఆవాసాలలో ఇది ఒకటి అని అధికారులు వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com