బాలీవుడ్ సినీ నిర్మాతనని చెప్పుకొంటూ ఓ భారతీయుడు ..

- July 19, 2016 , by Maagulf
బాలీవుడ్ సినీ నిర్మాతనని చెప్పుకొంటూ ఓ భారతీయుడు ..

బాలీవుడ్ సినీ నిర్మాతనని చెప్పుకొంటూ ఓ భారతీయుడు లండన్ బ్యాంకులను మోసగించాడు. అసలు సినిమాలు తీయకుండానే లేదా తనకు సంబంధంలేని సినిమా పేరిట పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నాడు. పైగా వ్యాట్, పన్ను రాయితీలు పొందాడు. ఇలా మొత్తంగా 45 లక్షల పౌండ్లు (సుమారు రూ.40 కోట్లు) కుచ్చుటోపీ పెట్టాడు. బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన కరణ్ అరోరా లండన్‌లో సందీప్ అరోరాగా అవతారమెత్తి ఈ మోసానికి పాల్పడినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. మంగళవారం ఆర్థిక నేరగాళ్ల జాబితాను లండన్ అధికారులు విడుదల చేయగా, అందులో సందీప్ అరోరాతో పాటు పాక్‌కు చెందిన ఫైసల్ భట్ ఉన్నారు. ఫైసల్ 100 బ్యాంకులను మారుపేర్లతో రుణాలు తీసుకుని రూ.100కోట్లతో పాక్‌కు చెక్కేశాడని అధికారులు పేర్కొన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com