30 బిలియన్ దిర్హామ్‌లతో డిజర్ట్ రోజ్ సిటీ
- July 19, 2016
దుబాయ్ మునిసిపాలిటీ ఎకో ఫ్రెండ్లీ డిజర్ట్ రోజ్ సిటీ ప్రాజెక్ట్‌కి అనుమతులు మంజూరు చేసినట్లు పేర్కొంది. అల్ రువయ్యా ప్రాంతంలో ఈ సిటీ నిర్మితం కానుంది. 40 శాతం ఎలక్ట్రిసిటీని, అలాగే 40,000 క్యూబిక్ మీటర్స్ నీటినీ ఈ సిటీలో ఉండేవారికి అందించేలా ప్రాజెక్ట్‌ని రూపొందించారు. డిజర్ట్ రోజ్ షేప్‌లో డిజైన్ చేయబడ్డ ఈ సిటీ నిర్మాణం ప్రపంచంలోనే అత్యద్భుతంగా ఉండబోతోందని దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ హుస్సేన్ నాజర్ లూటా చెప్పారు. స్కూల్స్, షాపింగ్ సెంటర్స్, క్లినిక్స్, హాస్పిటల్స్, మసీదులు, పోలీస్ స్టేషన్ సహా పలు సౌకర్యాలు ఈ సిటీలో ఉంటాయి. సుమారు 30 బిలియన్ దిర్హామ్‌ల ఖర్చుతో 4,000 హెక్టార్లలో రూపొందించనున్న ఈ ప్రాజెక్ట్‌లో 30,000 ఇళ్ళుంటాయి. ఇందులో 20,000 ఇళ్ళు ఎమిరేటీలకు, మిగిలిన 10,000 వలసదారులకోసం కేటాయిస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







