బాలీవుడ్ సినీ నిర్మాతనని చెప్పుకొంటూ ఓ భారతీయుడు ..
- July 19, 2016
బాలీవుడ్ సినీ నిర్మాతనని చెప్పుకొంటూ ఓ భారతీయుడు లండన్ బ్యాంకులను మోసగించాడు. అసలు సినిమాలు తీయకుండానే లేదా తనకు సంబంధంలేని సినిమా పేరిట పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నాడు. పైగా వ్యాట్, పన్ను రాయితీలు పొందాడు. ఇలా మొత్తంగా 45 లక్షల పౌండ్లు (సుమారు రూ.40 కోట్లు) కుచ్చుటోపీ పెట్టాడు. బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన కరణ్ అరోరా లండన్‌లో సందీప్ అరోరాగా అవతారమెత్తి ఈ మోసానికి పాల్పడినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. మంగళవారం ఆర్థిక నేరగాళ్ల జాబితాను లండన్ అధికారులు విడుదల చేయగా, అందులో సందీప్ అరోరాతో పాటు పాక్‌కు చెందిన ఫైసల్ భట్ ఉన్నారు. ఫైసల్ 100 బ్యాంకులను మారుపేర్లతో రుణాలు తీసుకుని రూ.100కోట్లతో పాక్‌కు చెక్కేశాడని అధికారులు పేర్కొన్నారు
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







