పొలిటికల్ ఎంట్రీ పై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
- September 13, 2025
న్యూ ఢిల్లీ: తెలుగు చిత్ర పరిశ్రమలో వినోదానికి పర్యాయపదంగా నిలిచిన ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం తన జీవన యాత్రను అక్షరరూపంలోకి మలిచారు. ఆయన రాసిన ఆత్మకథ ‘ME and मैं’ ను మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం తన అనుభవాలను, జీవితంలోని ఎన్నో మలుపులను స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.బ్రహ్మానందం మాట్లాడుతూ, తాను రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశ్యం ఎప్పుడూ లేనని, తనకు రాజకీయ నేపథ్యం కూడా లేదని స్పష్టంచేశారు.
“నేను పేద కుటుంబం నుంచి వచ్చాను. జీవితం మొదట్లో చాలా కష్టాలే ఎదురయ్యాయి. ఉపాధ్యాయుడిగా నా ప్రయాణం ఆరంభమైంది.అయితే నటనపై ఉన్న అమితాసక్తి నన్ను సినిమా రంగం లోకి తీసుకొచ్చింది.అదృష్టం కలిసివచ్చి, ప్రేక్షకులు చూపిన మమకారం వల్లే ఇంతదూరం వచ్చాను” అని ఆయన చెప్పారు.బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘నేను ఈ పుస్తకం రాయడానికి ఎంతో మంది స్ఫూర్తి ఇచ్చారు.
ఎంతో మంది మహానుభావులు చిన్న స్థాయి నుంచి నేడు దేశం గర్వించే స్థాయికి చేరుకున్నారు.1200కి పైగా సినిమాలు చేశానంటే అది కచ్చితంగా ఆ నటరాజస్వామి ఆశీర్వాదంతో పాటు ప్రేక్షకుల అభిమానం, ప్రేమే కారణం’ అని చెప్పుకొచ్చారు.నా జీవితంలోని ఎత్తుపల్లాలు, సినీ ప్రయాణంలో పడిన కష్టాలు, అందుకున్న సత్కరాలు అన్నీ ఈ పుస్తకంలో రాశాను. నాకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు.రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి కూడా లేదు. నా జీవితంలో సినీ రంగానికే అంకితం చేశారు. నా పదవికి విరమణ ఉంటుందేమో కానీ పెదవికి ఉండదు.
మనం ఎంతో పవిత్రంగా చూసే కమలం బురద నుంచే పుడుతుంది. అలాగే కష్టపడి పనిచేస్తేనే విజయం వరిస్తుంది. ఈ విషయంతో వెంకయ్యనాయుడు నాకు ఎంతో ప్రేరణగా ఉంటారు. ఈ మధ్య సినిమాలు తగ్గించేసినా మీమర్స్ నన్ను వైరల్ చేస్తున్నారు. అందుకే ఈ మధ్య గ్లోబల్ కమెడియన్‌గా అవార్డు కూడా ఇచ్చారు.నన్ను కమెడియన్ నుంచి మీమ్స్ బాయ్‌గా మార్చేశారు. ఏం చేసినా పది మందిని నవ్వించడమే నా జీవిత లక్ష్యం’ అన్నారు బ్రహ్మానందం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘బ్రహ్మానందం అలుపెరుగని ఆర్టిస్ట్. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారు.
హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తీసుకొచ్చిన ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని నేను ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. ఈ పుస్తకం ఆరు భాషల్లో వస్తోంది. బ్రహ్మానందం 1200 సినిమాల్లో నటించారు. ఆయన తెరపై కనిపిస్తే చాలు తెలియకుండానే నవ్వు వచ్చేస్తుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మాతృభాషని నేర్చుకోవాలి. అలాగే మనదేశంలో ఎక్కువ మంది హిందీ మాట్లాడతారు. దేశం దాటి బయటికి వెళితే ఇంగ్లీష్ రాకపోతే బతకలేం. అందుకే ప్రతి ఒక్కరూ మాతృభాషతో పాటు మనకి అవసరమైన ఇతర భాషల్ని కూడా నేర్చుకోవాలి’ అని ప్రసంగించారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్‌నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్‌పోర్ట్ సేవల పెండింగ్‌ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్‌లో పొగమంచు హెచ్చరిక జారీ..!!







