ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!

- September 14, 2025 , by Maagulf
ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!

రియాద్: సైబర్ నేరాలపై  సౌదీ అరేబియా ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా ఫేక్ ప్లాట్ ఫామ్స్ తో నేరాలకు పాల్పడుతున్న ముఠాను రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ముగ్గురు సిరియన్లు ఫేక్ ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్స్ ను క్రియేట్ చేయడంలో సిద్ధహస్తులని పోలీసులు తెలిపారు.

అలాగే వీరిపై అనేక నేరాలకు సంబంధించిన కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఇతరుల వాహనాలను ఫేక్ పేపర్స్ తో విక్రయించడంతోపాటు ఫేక్ వీసాలు, వర్క్ పర్మిట్లు వంటి అనేక నేరాలలో ముఠా సభ్యులు నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. దాంతోపాటు విదేశాల నుంచి ఫండ్స్ ను చట్టవిరుద్ధంగా ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్లు రియాద్ పబ్లిక్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com