మలేసియాలో చిక్కుకున్న మన మహిళ హెచ్చార్సీని ఆశ్రయించనున్న భర్త
- July 16, 2015
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఉత్తరపాలెం వల్లూరుకు చెందిన యాల్లమెల్లి శాంతాకుమారి ఇంటిపని చేయడానికి 23 పిబ్రవరి 2015 న మలేసియా వెల్లింది. యజమాని పెట్టె హింసను తట్టుకోలేకపోతున్నానని, అనారోగ్యంగా ఉన్నానని రెండు నెలల క్రితం ఆమె ఫోన్ ద్వారా భర్త వెంకటేశ్వర రావుకు తెలియపరిచింది. చర్చి పాస్టర్ రత్నం, సంఘ సేవకురాలు సునీతా ఏలూరి గారల సలహా ప్రకారం అతను ఈ విషయాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కు 9 జూన్ 2015 న పిర్యాదు చేశారు. హైదరాబాద్ లోని మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ అనే ప్రవాసి కార్మిక సంఘం వారు ఈ విషయాన్ని 'మదద్' (భారత రాయబార కార్యాలయాల్లో దౌత్య సంబంధమైన ఫిర్యాదుల నమోదు మరియు పర్యవేక్షణ వ్యవస్థ) ద్వారా మలేసియా రాజధాని కౌలాలంపూర్ లోని ఇండియన్ హైకమీషన్ దృష్టికి తీసికెళ్లారు.
ఫిర్యాదు చేసి నెలకుపైగా అవుతున్నా ఫలితం లేనందున, శాంతాకుమారి భర్త వెంకటేశ్వర రావు 17 జులై 2015 న హైదరాబాద్ లోని మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించనున్నాడు. మలేసియా రాజధాని కౌలాలంపూర్ లోని ఇండియన్ హైకమీషనర్ (భారత రాయబారి), డిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నారై విభాగం స్పెషల్ సెక్రెటరీ (ప్రోటోకాల్), పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ లను ప్రతివాదులుగా చేర్చుతూ ఆయన పిటిషన్ దాఖలు చేయనున్నారు.
--'మాగల్ఫ్' ప్రతినిధి, హైదరాబాద్
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







