క్యారెట్‌ గులాబ్‌ జామ్‌

- July 16, 2015 , by Maagulf
క్యారెట్‌ గులాబ్‌ జామ్‌

క్యారెట్‌ గులాబ్‌ జామ్‌
కావలిసిన పదార్ధాలు
క్యారెట్‌ తురుము - ఒక కప్పు
కొబ్బరి తురుము - ఒక కప్పు
యాలకుల పొడి - రెండు స్పూన్లు
జీడిపప్పు పొడి - ఒక స్పూను
బాదం పప్పు - ఒక స్పూను
పంచదార - రెండు కప్పులు
గులాబ్‌ జామ్‌ పొడి - 200గ్రా
నూనె లేదా నెయ్యి - తగినంత
పంచదార పాకం కోసం అరకిలో
తయారీ విధానం
బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి జీడిపప్పు, బాదంపప్పు ముక్కలు వేసి వేగాక కొబ్బరి, క్యారెట్‌ తురుము కూడా వేసి బాగా వేగాక దానిలో రెండు కప్పుల పంచదార వేసి కొద్దిగా నీరు పోసి బాగా ఉడికించాలి. ఈ మిశ్రమం దగ్గరగా అయ్యేవరకూ ఉడికించి చివరిగా కొద్డిగా యాలకుల పొడి వేసి స్టవ్‌ ఆఫ్‌ చేసి ఆరాక చిన్న చిన్న ఉండలుగాచేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి గులాబ్‌ జామ్‌ పొడి తీసుకుని కొద్దిగా నీరు పోసి చపాతీ ముద్దలా కలుపుకొని చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకొని మధ్యలో క్యారెట్‌ మిశ్రమంతో చేసిన ఉండను ఉంచి అంచులు మూసేసి నూనెలో బ్రౌన్‌ రంగు వచ్చే వరకూ వేయించి పంచదార పాకంలో వేయాలి.
పంచదార పాకం కోసం
ఒక మందపాటి గిన్నెలో కొద్దిగా నీరు పోసి దానిలో అరకిలో పంచదార వేసి లేత పాకం వచ్చే వరకూ మరిగించి చివరగా మిగిలిన యాలకుల పొడి వేసి మూత పెట్టేయాలి.



 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com