అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- September 15, 2025
మనామా: బహ్రెయిన్ లోని నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (NHRA) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ అహ్మద్ మొహమ్మద్ అల్ అన్సారీ.. జస్రాలోని అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించారు. ఈ ఫెసిలిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ మొహమ్మద్ అల్ సాతితో పాటు పలువురు అధికారులు ఆయన వెంట ఉన్నారు.
ఈ పర్యటన సందర్భంగా ఫెసిలిటీలోని వివిధ విభాగాలను పరిశీలించారు. పేషంట్లకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బహ్రెయిన్ జాతీయ ఆరోగ్య ప్రణాళిక లక్ష్యాలకు అనుగుణంగా అమానా హెల్త్ కేర్ సేవలు అందిస్తుందన్నారు.
బహ్రెయిన్ ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల నెట్‌వర్క్ అయిన M42లో భాగంగా ముమ్తలకట్ భాగస్వామ్యంతో అమానా హెల్త్ కేర్ ను స్థాపించారు. ఇది ప్రత్యేకమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేషంట్లకు సేవలు అందించేందుకు ఒమన్ లో ఏర్పాటైన మొట్టమొదటి ఆసుపత్రిగా గుర్తింపు పొందింది. ఇందులో 100కిపైగా ఇన్ పేషంట్ బెడ్స్ ఉన్నాయి.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం