ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!

- September 15, 2025 , by Maagulf
ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!

కువైట్: ఆషెల్ ఫర్ కంపెనీస్ మరియు ఆషెల్ ఫర్ బ్యాంక్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కార్మికుల వేతనాలను బదిలీ చేయడం గురించి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) బ్యాంకుల సమాఖ్యతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి మ్యాన్ పవర్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ రబాబ్ అల్-ఒసైమి అధ్యక్షత వహించారు. కార్మికుల హక్కులను కాపాడటానికి అథారిటీ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కాగా, యజమాని ఫైళ్లను బ్యాంకులకు సమర్పించడానికి సమగ్ర సాంకేతిక ప్రక్రియపై చర్చించారు. బ్యాంకింగ్ ప్రతినిధులు సాంకేతిక సవాళ్లపై తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అడ్డంకులను అధిగమించడానికి సమన్వయంతో పనిచేయాలని అథారిటీ తెలిపింది. ఎలక్ట్రానిక్ సాలరీ బదిలీ నిబంధనలను పాటించని యజమానుల లావాదేవీలను నిలిపివేయడం వంటి కఠినమైన చర్యలను బ్యాంకులు త్వరలో అమలు చేస్తాయని అల్-ఒసైమి హెచ్చరించారు. కార్మికుల హక్కులను రక్షించడంలో.. న్యాయమైన, పారదర్శకమైన కార్మిక వాతావరణాన్ని పెంపొందించడంలో ఈ చర్య కీలకంగా పనిచేస్తుందన్నారు.  ఆమోదించబడిన విధానాలకు అనుగుణంగా బ్యాంకుల ద్వారా ప్రత్యేకంగా సాలరీ ఫైళ్లను సమర్పించాలని అథారిటీ యజమానులను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com