ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- September 15, 2025
కువైట్: ఆషెల్ ఫర్ కంపెనీస్ మరియు ఆషెల్ ఫర్ బ్యాంక్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కార్మికుల వేతనాలను బదిలీ చేయడం గురించి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) బ్యాంకుల సమాఖ్యతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి మ్యాన్ పవర్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ రబాబ్ అల్-ఒసైమి అధ్యక్షత వహించారు. కార్మికుల హక్కులను కాపాడటానికి అథారిటీ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కాగా, యజమాని ఫైళ్లను బ్యాంకులకు సమర్పించడానికి సమగ్ర సాంకేతిక ప్రక్రియపై చర్చించారు. బ్యాంకింగ్ ప్రతినిధులు సాంకేతిక సవాళ్లపై తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అడ్డంకులను అధిగమించడానికి సమన్వయంతో పనిచేయాలని అథారిటీ తెలిపింది. ఎలక్ట్రానిక్ సాలరీ బదిలీ నిబంధనలను పాటించని యజమానుల లావాదేవీలను నిలిపివేయడం వంటి కఠినమైన చర్యలను బ్యాంకులు త్వరలో అమలు చేస్తాయని అల్-ఒసైమి హెచ్చరించారు. కార్మికుల హక్కులను రక్షించడంలో.. న్యాయమైన, పారదర్శకమైన కార్మిక వాతావరణాన్ని పెంపొందించడంలో ఈ చర్య కీలకంగా పనిచేస్తుందన్నారు. ఆమోదించబడిన విధానాలకు అనుగుణంగా బ్యాంకుల ద్వారా ప్రత్యేకంగా సాలరీ ఫైళ్లను సమర్పించాలని అథారిటీ యజమానులను కోరింది.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం