ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- September 15, 2025
యూఏఈ: సోషల్ మీడియా మరియు గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న 8 మంది వ్యక్తులను కోర్టు దోషులుగా తేల్చి, జైలుశిక్ష విధించింది. అబుదాబి క్రిమినల్ కోర్టు దోషులకు మూడు నుండి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష తోపాటు వన్ మిలియన్ దిర్హామ్‌ల వరకు జరిమానా విధించింది. నిందితులు నేరం చేయడానికి ఉపయోగించిన పరికరాలను సీజ్ చేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే, దోషులు ఇంటర్నెట్ను యాక్సెస్ చేయకుండా కోర్టు నిషేధించింది. దోషుల సంబంధిత ఆన్లైన్ అకౌంట్లను మూసివేయాలని ఆదేశించింది. నిందితుల్లో ముగ్గురిని వారి జైలు శిక్ష పూర్తయిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు స్పష్టం చేసింది.
అబుదాబిలోని అధికారులు అనుమానాస్పద ఆన్లైన్ కార్యకలాపాలు, మైనర్లపై ఆన్లైన్లో లైంగిక వేధింపుల కేసులను పర్యవేక్షించారు. విస్తృత దర్యాప్తు తర్వాత, అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యయని, నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా, నిందితులకు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాలను విశ్లేషించగా అందులో పిల్లలకు సంబంధించిన అశ్లీల కంటెంట్ ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
కోర్టు తీర్పు సందర్భంగా అబుదాబి పబ్లిక్ ప్రాసిక్యూషన్, తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించాలని, సోషల్ మీడియా లేదా గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తెలియని వ్యక్తుల నుండి స్నేహితుల అభ్యర్థనలను అంగీకరించవద్దని, కలిగే ప్రమాదాల గురించి అవగాహన పెంచాలని మరియు బ్లాక్మెయిల్ బాధితులైతే ఎలా స్పందించాలో వారికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







