భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- September 15, 2025
కువైట్: భద్రతా పరమైన సహకారంపై సౌదీ అరేబియా, కువైట్ చర్చలు జరిపాయి. సౌదీ అంతర్గత మంత్రి ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ కువైట్‌లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహాద్ యూసఫ్ సౌద్ అల్-సబాతో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య భద్రతా సహకారాన్ని పెంపొందించడానికి రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలకు అనుగుణంగా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు ప్రిన్స్ అబ్దులాజీజ్ వెల్లడించారు.
ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రాత్మక సోదర మరియు వివిధ రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. అదే సమయంలో రెండు దేశాల అంతర్గత మంత్రిత్వ శాఖల మధ్య కొనసాగుతున్న భద్రతా సహకార విస్తరణపై చర్చించారు. సమాచార మరియు నైపుణ్యాల మార్పిడి, వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడంలో సహకారం, భద్రతాపరమైన శిక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, మానవ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం, అలాగే తాజా భద్రతా టెక్నాలజీ వ్యవస్థలను ఉపయోగించడంలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఇరుదేశాలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం