హత్యకు గురైన భారత కార్మికుని మృతదేహం నేడు స్వదేశానికి
- July 19, 2016
మస్క్యాట్: ఒక ఆహార ఉత్పత్తుల పంపిణీదారుని వద్ద రోజువారీ సేకరణ ఏజెంట్ గా జీవనం కొనసాగిస్తూ గతవారం ముత్తరహ్ సమీపంలో గొంతు కోయబడి దారుణ హత్యకు గురయ్యిన సత్యన్ కేశవన్ ( 50 ) విషాద ఉదంతం పాఠకులకు విదితమే. కాగా ఆయన మృతదేహాన్ని బంధువులు స్నేహితులు మంగళవారం భారతదేశంకు పంపించారు.
మేము సత్యన్ కేశవన్ స్వస్థలమైన కేరళ రాష్ట్రం లోని త్రివేండ్రంకు ఆయన పార్థివ దేహంని పంపడానికి అన్ని విధానాలు పూర్తి చేశామని, బుధవారం రాత్రి స్వదేశానికి చేరుకొంటుందని ఒక అధికారి " మా గల్ఫ్ డాట్ కామ్ "కు చెప్పారు. గత వారం మంగళవారం ముత్తరహ్ లోని తన అపార్ట్మెంట్ లో దారుణ హత్యకు గురైన 50 ఏళ్ల సత్యన్ కేశవన్ సత్యన్ ఒక ఆహార ఉత్పత్తుల పంపిణీదారుని వద్ద రోజువారీ సేకరణ ఏజెంట్ గా జీవనం కొనసాగిస్తున్నాడు.15 వేల రియాల్ ఓమాన్ల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బును సేకరిస్తారు. మరణించిన సత్యన్ గత 30 సంవత్సరాలుగా ఒమన్ లో సౌమ్యుడిగా వివాదరహితుడిగా నివసిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
రాయల్ ఒమన్ పోలీసుల ప్రాధమిక పరిశోధనల ప్రకారం ఈ హత్య వెనుక దోపిడీ చేయడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. సత్యన్ కేశవన్ యొక్క ఫ్లాట్ లోని సహచరులైన ఇద్దరు బంగ్లా దేశీయులను ప్రశ్నించి అదుపులోకి తీసుకొని ఆ తరువాత వారిని విడుదల చేశారు. ఒమాన్ లో సత్యన్ కేశవన్ ఆహార వస్తువుల సరఫరా ఔట్ సోర్సింగ్ పిండి మిల్ సంస్థ లో ఫోర్ మాన్ గా పనిచేస్తున్నాడు
పిండి మిల్లులో కొందరు తెలిపిన వివరాల ప్రకారం, సత్యన్ కేశవన్ ను తన కంపెనీ పని నిమిత్తం నగదు సేకరించడానికి నమ్మకస్తుడైన సత్యన్ కేశవన్ ను సంస్థ ఉపయోగిస్తారు. సత్యన్ కేశవన్ కు భార్య ప్రసీద మరియు వారి ఏకైక కుమార్తె స్వాతి ఉన్నారు. ప్రస్తుతం స్వాతి మాస్టర్ టెక్నాలజీ ప్రవేశ పరీక్షల్లో శిక్షణా తరగతులకు హాజరు కావడానికి ఆమె భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ కు వెళ్ళింది.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!







