Feel Good Melody Kothagunde song from 'Idli Kottu' released

- September 15, 2025 , by Maagulf
Feel Good Melody Kothagunde song from \'Idli Kottu\' released

‘కుబేర’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమాతో అలరించబోతున్నారు. ధనుష్ హీరో, డైరెక్టర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్‌, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆకాష్ బాస్కరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

డైరెక్టర్ గా ధనుష్ కి ఇది నాలుగో మూవీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ కొత్తగుందే సాంగ్ రిలీజ్ చేశారు.

జివి ప్రకాష్ కుమార్ ఈ సాంగ్ ని ఫీల్ గుడ్ మెలోడీ గా కంపోజ్ చేశారు. సింగర్స్ కృష్ణ తేజస్వి, శ్వేతా మోహన్ వోకల్స్ సాంగ్ కి మరింత మెలోడీ వైబ్ ని తీసుకొచ్చాయి. సామ్రాట్ నాయుడు ఆకట్టుకునే లిరిక్స్ అందించారు

సాంగ్ లో ధనుష్, నిత్యా మీనన్ కెమిస్ట్రీ చాల బ్యూటీఫుల్ గా వుంది. వినగానే కనెక్ట్ అయ్యే ఈ సాంగ్ మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వుంది.

శ్రీ వేదక్షర మూవీస్ బ్యానర్ ద్వారా నిర్మాత రామారావు చింతపల్లి తెలుగులో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.
 
ఈ చిత్రంలో అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కిరణ్ కౌశిక్ డీవోపీ గా పని చేస్తుండగా, ప్రసన్న జీకే ఎడిటర్, జాకీ ప్రొడక్షన్ డిజైనర్. పీటర్ హెయిన్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

ఇడ్లీ కొట్టు తెలుగు, తమిళ్ లో అక్టోబర్ 1న రిలీజ్ కానుంది.

నటీనటులు: ధనుష్, నిత్యా మీనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: ధనుష్
నిర్మాతలు: ఆకాష్ బాస్కరన్ & ధనుష్
బ్యానర్: డాన్ పిక్చర్స్ & వండర్‌బార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్
తెలుగు రిలీజ్: రామారావు చింతపల్లి శ్రీ వేదక్షర మూవీస్
సంగీతం: G.V ప్రకాష్ కుమార్
ఎడిటర్: G.K ప్రసన్న
DOP: కిరణ్ కౌశిక్
యాక్షన్: పీటర్ హెయిన్
ఆర్ట్: జాకీ
డాన్స్ కొరియోగ్రాఫర్: సతీష్
పబ్లిసిటీ డిజైన్: కబిలన్
ప్రొడక్షన్ కంట్రోలర్: డి.రమేష్ కూచిరాయర్
మ్యూజిక్ అండ్ డిజిటల్ పార్ట్నర్ - సరేగామ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రేయాస్ శ్రీనివాసన్
పీఆర్వో : వంశీ శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com