అంతరంగం

- July 16, 2015 , by Maagulf
అంతరంగం

ఇటీవలి కాలం లో నా మౌనం కొంతమందికి అసమర్ధత గా , మరికొంతమంది కి  సబబైన నిర్ణయం గా  కూడా  అనిపించవచ్చు. అది  చూసే కళ్ళు అర్ధం చేసుకునే మనస్సుబట్టి వుంటుంది. అర్ధం లేని అపోహలను ఆపాదించుకుని పైకి నవ్వుతూ, మనసులో మాత్రం నిరంతరం వ్యతిరేక భావన కలిగి వుండడం చాలా హేయమైనది. భగవంతుని లీలా నాటకం లో నిమ్మిత్త పాత్రల కే పరిమితమైన మనం ఆయనచే సృజింప పడ్డ జీవితం అనే వైకుంట పాళి లో ఆట బొమ్మలం. ఎక్కడం దిగడం అంతా మాయ. 

ధర్మచక్రం లో కాలవశాని కి బద్దుడ నై  జరుగుతున్న సంఘటనలు నా కర్మ ఫలం అని నమ్మి మౌనం గా ఆ పరమాత్మ ను ధ్యానిస్తూ వుంటే అనాలోచిత ధోరణితో నా పై కు విమర్శ లు చేసే ప్రబుద్దులకు ఉదాహరణ ల తో కూడిన కొన్ని హిత వాక్యాలు 

 

అలనాటి త్రేతా యుగంబున మహా బలురైన అనుచర గణాన్ని కలిగి వుండి కూడా కామ, క్రోధా లను విడువలేక ధర్మం చేతిలో నిహతుడైనాడు పౌలస్త్యుడు. 

 

ద్వాపరమున భీష్మ, ద్రోణ,కృప, అశ్వద్ధామ వంటి మహా వీరులున్నా మద మాత్సర్యాలను నిగ్రహించలేక కర్ణుని తో కూడి, తన తో పాటు యావత్తు కురు సైన్యాన్ని సంగ్రామ రంగం లో ధర్మమనే అగ్నికి ఆహుతి గావించాడు గాంధారి సుతుడు  

 

కాని భగవంతుని పై అపార విశ్వాసాన్ని కలిగి నిరంతర సత్యాన్వేషణ లో రమించే  భక్తులకు ఆ పరమాత్మ తప్పకుండా మంచి దారి చూపిస్తాడనే సనాతన సిద్దాంతానికి నిలువెత్తు నిదర్శనాలే ప్రహ్లాద, అంబరీష, మార్కండేయ చరిత్రలు. యుగాలు మారినా అదే స్పూర్తి, అపార రాజ భోగాల తో, మహారాజ ప్రశంసలు పొంది ఆపైన విధి  వశాత్తు ఇబ్బందులకు గురి అయి జీవన చరమాంకాన్ని గడిపిన కవి సామ్రాట్ కన్నా, ఆ రామభద్రుని ఆనతి పై భాగవత రచనను గావించి, హలికుడి గా మిగిలినా,  మహోన్నతుడైన పోతనామాత్యుల వారి జీవనమే నాకు ఆదర్శం.    

 

అందుకే నిశ్శబ్దం గా, మంచి రోజుల కోసం ఆ పరమాత్మను ధ్యానిస్తూ కాలం గడుపుతున్నాము. కాని ఇది జీర్ణించుకోలేని వారు మాత్రం నా చేతకాని తనం గా చెప్పుకుంటున్నారు. తుఫాను ముందు నిశ్శబ్దం ఎంత గాంభీర్యం గా వుంటుందో నేను అంతే. కనుక వ్యర్ధ ప్రలాపనలు మాని కుదిరితే పరోపకార బుద్ది తో లేదా తమ క్షేమ సమాచారాలని కలిగి ఉండమని సూచిస్తున్నాను 

 

చివరిగా చిన్ననాటి నుండి శ్రమ శక్తి ని బలం గా నమ్మిన నేను ఆ శ్రమైక సౌందర్యం లో నే స్వాంతన పొందుతూ, కర్మ ఫలాన్ని అందించే ఆ అంతర్యామికి తప్ప అన్యులకు మ్రొక్క లేను. ఇది సత్యం , పునః సత్యం

 

పరుషమైనా, ఆర్తితో ఆవిష్కరించిన నా అంతరంగాన్ని అర్ధం చేసుకుంటున్న శ్రేయోభిలాషులకు మనః పూర్వక కృతజ్ఞతాభి వందనముల తో 

 

 మీ ఆత్మీయుడు 

సుబ్రహ్మణ్య శర్మ(దుబాయ్)  

          

 

 

 

         

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com