సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- September 18, 2025
రియాద్: 2026 నుండి 2029 వరకు వచ్చే నాలుగు సంవత్సరాలకు సంబంధించిన సెలవుల జాబితాను సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) ప్రకటించింది.
ఈద్ అల్-ఫితర్ కోసం వచ్చే ఏడాది మార్చి 17 నుండి మార్చి 23 వరకు సెలవులు రానున్నాయి. 2027కు సంబంధించి మార్చి 7 నుండి మార్చి 11 వరకు , 2028 సంవత్సరంలో ఫిబ్రవరి 27 నుండి మార్చి 2వ తేది వరకు; 2029 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 12 నుండి ఫిబ్రవరి 18 వరకు అధికారిక సెలవులు ఉంటాయి.
ఈద్ అల్-అధా ను పురస్కరించుకొని వచ్చే ఏడాది మే 24 నుండి మే 28 వరకు సెలవులు ప్రకటించారు. ఇక 2027లో మే 16 నుండి మే 20 వరకు; 2028లో మే 3 నుండి మే 9 వరకు; 2029లో ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 26 వరకు సెలవులు రానున్నాయి.
వీటితోపాటు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న జరుపుకునే సౌదీ జాతీయ దినోత్సవం, ఫిబ్రవరి 22న వ్యవస్థాపక దినోత్సవం అధికారిక సెలవు దినాలుగా పేర్కొన్నారు. ఏవైనా హాలీడేలు శుక్రవారం వస్తే, ఆ సెలవుదినాన్ని గురువారంకు, అదే శనివారం వస్తే, ఆ సెలవుదినాన్ని ఆదివారంకి మారుతుందని పేర్కొన్నారు.
రమదాన్ సందర్భంగా బ్యాంకులు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు పనిచేస్తాయి. రెమిటెన్స్ కేంద్రాలు మరియు చెల్లింపు సేవా కేంద్రాలు ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ఆరు గంటల పాటు అనువైన షిఫ్ట్లను నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!