ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!

- September 18, 2025 , by Maagulf
ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!

కువైట్: వరుసగా రెండవ సంవత్సరం, నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (NBK) వైస్ చైర్మన్ మరియు గ్రూప్ CEO అయిన ఇసామ్ అల్-సాగర్ కువైట్‌లో సస్టైనబిలిటీ నాయకుడిగా ఎంపికయ్యారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్స్ 2025 జాబితాలో మిడిల్ ఈస్ట్ అంతటా బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవల రంగంలో ఆరవ స్థానంలో నిలిచారు.

అల్-సాగర్‌తో పాటు ఫోర్బ్స్ జాబితా మరో ముగ్గురు కువైటీలు స్థానం సంపాదించారు. కువైట్ ప్రాజెక్ట్స్ కంపెనీ హోల్డింగ్ (KIPCO) CEO షేఖా అదానా నాజర్ అల్-సబా,  జైన్ గ్రూప్ వైస్ చైర్మన్ మరియు CEO బాదర్ నాజర్ అల్-ఖరాఫీ మరియు ఎజిలిటీ వైస్ చైర్మన్ మరియు CEO తారిక్ అల్-సుల్తాన్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లుగా ఎంపికయ్యారు.

ఈ సంవత్సరం మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్ల జాబితాలో బ్యాంకింగ్, ఆయిల్, యుటిలిటీస్, ఆహారం మరియు వ్యవసాయం, పెట్టుబడి, పునరుత్పాదక ఇంధనం,  వ్యర్థాల నిర్వహణతో సహా 15 కీలక రంగాలలోని 126 మంది ఎగ్జిక్యూటివ్ లీడర్లు జాబితాలో స్థానం సంపాదించారు. ఈ జాబితాలో UAE నుంచి 67 మంది, సౌదీ అరేబియా 23 మందితో మరియు ఈజిప్ట్ 12 మందితో వరుసగా నిలిచాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com