దుబాయ్ లో చంద్రబాబు మీట్ & గ్రీట్: డాక్టర్ రవి వేమూరు
- September 19, 2025
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఏడాది అక్టోబర్ 17న దుబాయ్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో దుబాయ్ లోని ప్రవాసాంధ్రులు గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమం నిర్వహించబోతున్నామని ఏపీఎన్నార్టీఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి కుమార్ వేమూరు చెప్పారు. 17వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమం జరిగే వేదిక ఇంకా ఖరారు కాలేదని, వేదికతోపాటు రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వివరాలను ఏపీఎన్నార్టీఎస్ బృందం త్వరలోనే వెల్లడించనుందని తెలిపారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించిన వివరాల కోసం ఎదురుచూస్తుండాలని ఆయన కోరారు.
డాక్టర్ రవికుమార్ వేమూరు మార్గదర్శకత్వంలో, ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రాధాకృష్ణ రవి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







