అల్టరౌటి చికెన్ ఫ్రాంక్‌ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- September 19, 2025
రియాద్: సౌదీ అరేబియాలో తయారయ్యే అల్టరౌటి బ్రాండ్ చికెన్ ఫ్రాంక్‌ఫర్ట్ పై సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) హెచ్చరిక జారీ చేసింది. అథారిటీ నిర్వహించిన ప్రయోగశాల పరీక్షలలో ఈ ఉత్పత్తి స్టెఫిలోకాకస్ ఆరియస్ బ్యాక్టీరియాతో కలుషితమైందని నిర్ధారించింది. ఇది వినియోగదారులకు ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని హెచ్చరించారు. ఈ ఉత్పత్తిని వినియోగించకుండా ఉండాలని మరియు దానిని వెంటనే పారవేయాలని వినియోగదారులను కోరింది. మార్కెట్ నుండి ఉత్పత్తిని ఉపసంహరించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపింది. ఫ్యాక్టరీ ఉత్పత్తి లైన్‌ను నిలిపివేసిందని వెల్లడించింది.
ఆహార చట్టం మరియు దాని నిబంధనలను ఉల్లంఘించడం చేస్తే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10 మిలియన్ల సౌదీ రియాల్స్ వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చని అథారిటీ హెచ్చరించింది.
పౌరులు మరియు నివాసితుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఏవైనా ఉల్లంఘనలను తాము సహించబోమని అథారిటీ స్పష్టం చేసింది. కాల్ సెంటర్‌ను 19999లో సంప్రదించడం ద్వారా ఏదైనా ఆహార సంబంధిత ఉల్లంఘనలను నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







