హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- September 19, 2025
మనామా: మరొక వ్యక్తిపై దాడి చేసి శాశ్వత వైకల్యానికి కారణమైనందుకు 24 ఏళ్ల విద్యార్థిని మొదటి హై క్రిమినల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. అతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు 50 బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించింది. ఈ సంఘటన ఏప్రిల్ 15న జరిగింది. కారు హారన్ మోగించడంపై వివాదం తర్వాత గొడవ జరిగింది.
ఈ క్రమంలో బాధితుడి ముక్కుపై విద్యార్థి బలంగా కొట్టడంతో ఐదు శాతం శాశ్వత వైకల్యం కలిగిందని వైద్య నివేదిక నిర్ధారించింది. ఘర్షణ సమయంలో బాధితుడి కారును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసినందుకు నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది.
కాగా, బాధితుడు ఆపకుండా కారు హారన్ను ఉపయోగించడం వల్ల ఘర్షణ జరిగిందని నిందితుడు పేర్కొన్నాడు. అయితే నిందితుడు సౌక్ వకీఫ్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నాడని, దీంతో బాధితుడు హారన్ మోగించాడని సీసీ కెమెరాల ద్వారా అధికారులు నిర్ధారించారు. నిందితుడు తన వాహనం నుండి దిగి, బాధితుడిని అవమానించి, అతని ముక్కుపై కొట్టాడని, దాని వల్ల రక్తస్రావం జరిగిందని, అనంతరం బాధితుడి కారు అద్దాన్ని ధ్వంసం చేశాడని కోర్టుకు స్థానిక పోలీసు అధికారులు నివేదిక సమర్పించారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







