ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్‌లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!

- September 19, 2025 , by Maagulf
ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్‌లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!

యూఏఈ: గ్లోబల్ విలేజ్ పేరిట ఆన్‌లైన్‌లో మరియు సోషల్ మీడియాలో వైరలవుతున్న మోసపూరిత లింక్‌లకు వ్యతిరేకంగా దుబాయ్ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు.  కొత్త సీజన్ కోసం గ్లోబల్ విలేజ్ VIP ప్యాక్‌లను డిస్కౌంట్ ధరలకు అందిస్తామని తప్పుడు ప్రకటనలు ఉన్నాయని పేర్కొన్నారు.  ఈ లింక్‌లను క్లిక్ చేస్తే డబ్బుతోపాటు వ్యక్తిగత డేటాకు ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇదోక స్కామ్ అని, కొనుగోలుదారులను మోసగించడానికి సైబర్ ఫ్రాడ్స్ అధికారిక పేజీలను అనుకరించే వెబ్‌సైట్‌లను క్లోన్ చేశారని పోలీసులు తెలిపారు. 

గ్లోబల్ విలేజ్ టిక్కెట్ల కోసం ఉండే భారీ డిమాండ్‌ నేఫథ్యంలో ప్రతి సంవత్సరం ఇటువంటి ఫేక్ సైట్స్ కనిపిస్తాయని పోలీసులు హెచ్చరించారు. అక్టోబర్ 15న సీజన్ 30 కోసం గ్లోబల్ విలేజ్ ప్రారంభం కానుంది.

టిక్కెట్లు మరియు VIP ప్యాక్‌లను అధికారిక ఛానెల్‌ల ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు చెప్పారు.   గ్లోబల్ విలేజ్ సీజన్ 30 VIP ప్యాక్‌ల అమ్మకాలు దశలవారీగా ప్రారంభమవుతాయని నిర్వాహకులు ప్రకటించారు. సెప్టెంబర్ 20న ప్రీ-బుకింగ్‌తో ప్రారంభమై, సెప్టెంబర్ 27న సాధారణ అమ్మకాలు ప్రారంభమవుతాయి. ధరలు 1,800 నుండి 7,550 దిర్హమ్స్ వరకు ఉంటాయి.  ఒక అదృష్ట కొనుగోలుదారు 30వేల దిర్హమ్స్ విలువైన చెక్కును గెలుచుకుంటాడని ప్రకటించారు.

అనుమానాస్పద లింక్‌లకు దూరంగా ఉండాలని, ఇలాంటి లింకుల గురించిన సమాచారాన్నిఇ-క్రైమ్ ప్లాట్‌ఫామ్ ద్వారా లేదా 901 కు కాల్ చేయడం ద్వారా నివేదించాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com