16 వందల కోట్ల రూపాయల డబ్బు కరూర్-అరువంకుర్చి బైపాస్ రోడ్డుపై..
- July 20, 2016
కోటి, రెండు కోట్లు రూపాయలు కాదు.. అక్షరాల 16 వందల కోట్ల రూపాయల డబ్బు! ఈ నోట్ల కట్టలన్ని ఒక్కచోట పేర్చితే ఎంత బరువు, ఎంత పెద్ద సైజులో ఉంటుందో కదా..! ఈ డబ్బును తరలించాలంటే కంటెయినర్లు కావాలి.కర్ణాటకలోని మైసూర్ నుంచి కేరళ రాజధాని తిరువనంతపురానికి 16 వందల కోట్ల రూపాయల నగదును తరలించడానికి ఏర్పాట్లు చేశారు. రెండు కంటెయినర్లలో ఈ డబ్బును భారీ భద్రత మధ్య తరలిస్తున్నారు. తమిళనాడులో కరూర్-అరువంకుర్చి బైపాస్ రోడ్డుపై వెళ్తుండగా అనుకోని అవాంతరం వచ్చిపడింది. ఓ లారీ ఇంజిన్ లో సమస్య రావడంతో ఈ కంటెయినర్లు రోడ్డుపై ఆగిపోయాయి. భద్రతగా వస్తున్న సాయుధ పోలీసులు కంటెయినర్ల వద్ద రక్షణగా నిలిచారు. పూర్తి వివరాలు తెలియవు కానీ ఇది బ్యాంకులకు సంబంధించిన డబ్బుగా భావిస్తున్నారు. డబ్బును తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!









